తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని సార్లు మనం చెప్పే విషయాల వలన మనకే ప్రమాదం పొంచుకొస్తుంది. పని చేసే ప్రదేశంలో ఒకరితో స్నేహంగా ఉండడం చాలా మంచిది. అంతేకానీ అన్ని విషయాలని చెప్పుకోకూడదు. వ్యక్తిగత వివరాలు గురించి ఆరోగ్య విషయాలు గురించి కొన్నిటిని చెప్పుకోకపోవడమే మంచిది. ఒకవేళ వారితో ఆ విషయాలను చర్చిస్తే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జరిగే మేలు కంటే మీకు నష్టమే ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో ఈ విషయాలను అసలు చెప్పద్దు. మీ జీతం గురించి అప్పుల గురించి పెట్టుబడుల గురించి ఎవరికీ చెప్పకండి. ఇలా చేయడం వలన ఒత్తిడి, అనవసరమైన ఇబ్బందులు కలుగుతాయి. అలాగే ఎప్పుడూ కూడా ఆరోగ్య విషయాల గురించి చెప్పకండి. సెలవులు తీసుకోవడానికి టార్గెట్లు తప్పించుకోవడానికి చాలామంది అనారోగ్య సమస్యల గురించి చెప్తూ ఉంటారు.
బదులుగా నిజంగా సమస్య ఉంటే దానిని ఎలా అధికమిస్తారో తోటి ఉద్యోగస్తులకి కాకుండా హెచ్ఆర్, మేనేజర్ లాంటి వాళ్ళకి చెప్పండి. తోటి ఉద్యోగులకి చెప్పడం వలన టార్గెట్ ని తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారని వారు తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని ఇవ్వకండి. మీరు భవిష్యత్తులో ఉద్యోగ ప్రణాళికలు ఏమైనా వేసుకుంటే వాటి గురించి కూడా మీ తోటి ఉద్యోగస్తులకి చెప్పొద్దు ముందే చెప్తే మీ స్థానానికి ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది.
అలాగే సహ ఉద్యోగుల గురించి మేనేజ్మెంట్ల పై తోటి ఉద్యోగస్తులతో కామెంట్లు చేయకండి. దాని వలన మీ మీద అభిప్రాయం మారిపోతుంది. పైగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు పని చేసే చోట ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల గురించి మత విశ్వాసాల గురించి మాట్లాడొద్దు. ఇలాంటివి మాట్లాడటం వలన వృత్తి జీవితం సాఫీగా జరగదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వీటిని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఆఫీస్ లో మీ పనిని మీరు సాఫీగా చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది ఉండదు.