మరోసారి అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు !

-

మంచు మోహన్ బాబు కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మళ్ళీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు వెళ్లారు. జర్నలిస్టు పై దాడి కేసులో మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మంచు మోహన్ బాబు. ఈ లోపు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు మంచు మోహన్ బాబు తరఫు న్యాయవాది.

Mohan babu
Manchu Mohan Babu went into hiding again

మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే విచారణ జరుపి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో 16వ తేదీ హైదరాబాద్ నుంచి చంద్రగిరికి చేరుకున్నారు మోహన్ బాబు. బుధవారం సాయంత్రం నుంచి శ్రీ విద్యానికేతన్ నుంచి వెళ్లిపోయారు మంచు మోహన్ బాబు. బెంగళూరులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో… . మళ్ళీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు వెళ్లారట.

Read more RELATED
Recommended to you

Latest news