గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

-

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు, సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు వేయాలని జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా.. బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడంలేదన్న ఆరోపణలతో తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఇక నుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ యాప్ లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరు నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news