సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల
పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే.. సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది.
ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్ ని భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూ భారతిపై కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన
భూభారతి బిల్లు, కాస్తు కాలమ్/ అనుభవదారు కాలమ్ ని పునరుద్ధరించడం ద్వారా ఇప్పుడు పెద్ద
చర్చ నీయాంశమైంది. దశాబ్దాలుగా భూములు దున్నుకున్న వారి పేర్లు తిరిగి రికార్డుల్లోకి రావడం వల్ల కొన్ని వర్గాలు సంతోషించగా, మరికొన్ని వర్గాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.