టాలీవుడ్ ను హైదరాబాద్ నుంచి తరలించే కుట్రలు – DK అరుణ

-

బీజేపీ ఎంపీ DK అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇంట్లో పిల్లలని భయబ్రాంతులకు గురిచేశారని… ఇంటి పై దాడి చేశారని మండిపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రం లో బౌన్సర్ లను పెట్టుకుని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని… అంబేద్కర్ గురుంచి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆగ్రహించారు. మేము కూడా ప్రజల్లోకి వెళతామన్నారు.

BJP MP DK Aruna made sensational comments

అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో వివరిస్తామని తెలిపారు. అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడితే… కాంగ్రెస్ ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడలేదు… రాహుల్ గాంధీ లోక్ సభలో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. సీఎం కాకముందు అయన బౌన్సర్ లను పెట్టుకుని తిరగలేదా అంటూ ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలు అయింది … సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌ నుంచి పంపించే కుట్ర జరుగుతుందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news