మరికాసేపట్లోనే రేవతి కొడుకు వద్దకు అల్లు అర్జున్ ఫ్యామిలీ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, పుష్ప డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ లు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించనున్నారు.
అనంతరం శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. సరిగ్గా 2 గంటలకు కిమ్స్ ఆసుపత్రికి పుష్ప డైరెక్టర్ సుకుమార్.. అల్లు అరవింద్ వెళ్లనున్నారు. ఇక అల్లు అరవింద్ తో పాటు ఆయన భార్య కూడా వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ తరుణంలోనే… శ్రీ తేజ్ ఉన్న ఆస్పత్రి వద్ద భద్రత కట్టు దిట్టం చేశారు పోలీసులు.