రేపు సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల మీటింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని దిల్ రాజ్ ప్రకటించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డిని సినీ పెద్దలతో కలవబోతున్నామని…. హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతలు…కలుస్తామన్నారు. రేపు 10 గంటలకు కలవబోతున్నామని ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిలా ఉంటాను.
రేపు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు దిల్ రాజ్. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పరిహారాన్ని నిర్మాత దిల్ రాజ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు.