శ్రీ తేజ్ ఆరోగ్యంపై వేణు స్వామి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ శ్రీ తేజ్ ను పరామర్శించారు వేణు స్వామి. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ… కచ్చితంగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపారు. మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో చేస్తానని ప్రకటించారు. వారి పాప కు రెండు లక్షలు ఇస్తున్నానన్నారు.
సినిమాలకు ముహూర్తాలు నేను పెట్టాను..కాబట్టి సినిమా వాడినే అందుకే నేను కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నానని తెలిపారు వేణు స్వామి. వారం రోజుల్లో హోమం చేస్తానని వివరించారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పరిహారాన్ని నిర్మాత దిల్ రాజ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు.