బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు మల్లిఖార్జున ఖర్గే. గాంధీ-నెహ్రూ వారసత్వం ఉన్న మేము ప్రత్యర్థుల అబద్ధాలను పటాపంచెలూ చేస్తాం. ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోంది. “కేంద్ర ఎన్నికల సంఘం” నిష్పాక్షికత పై పలు అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయు. దేశానికి అవసరమైన కీలక సంస్థలను తమ అధీనంలో, కనుసన్నల్లో మెలిగేలా చేజిక్కించుకోవాలని అధికార బిజేపి ప్రయత్నం చేస్తోంది. “కేంద్ర ఎన్నికల సంఘం” లాంటి రాజ్యాంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని అధికార బిజేపి ప్రయత్నిస్తోంది. కానీ, దీనిని అడ్డుకునేందుకు మా పోరాటన్ని కొనసాగిస్తాం అని తెలిపారు.
అలాగే మార్చిన ఎన్నికల నియమనిబంధనలను వెల్లడించాలని కోర్టు ఆదేశించినా, ఎందుకు దాచి పెడుతుంది. “బెల్గావి” సమావేశాల తర్వాత సరికొత్త ఉత్సాహంతో, ప్రతినబూని ప్రతిఒక్క కార్యకర్త అకుంఠిత దీక్షతో ప్రత్యర్థుల అబద్ధాలను, కుటిల ప్రయత్నాలను, సమిష్టిగా తిప్పికొట్టాలి. కష్టపడి పనిచేయడమే కాకుండా, కార్యకర్తలు, నాయకులకు వ్యూహాలుండాలి అని మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు.