పుష్ప-2 హీరో అల్లు అర్జున్ పై అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 సినిమాతో నేను అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యానని తెలిపారు అమితాబ్ బచ్చన్. నన్ను అల్లు అర్జున్‌తో పోల్చకండి.. అతను గొప్ప నటుడు అన్నారు అమితాబ్ బచ్చన్.
దీంతో పుష్ప-2 హీరో అల్లు అర్జున్ పై అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పుష్ప-2 హీరో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక అటు నాంపల్లి కోర్టులో హాజరుకావడంపై ట్విస్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరుకానున్నారు అల్లు అర్జున్. అంటే… ఆన్ లైన్ ద్వారానే… నాంపల్లి కోర్టులో జరిగే విచారణకు హాజరు కానున్నారు అల్లు అర్జున్. శాంతి భద్రతల నేపథ్యంలో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు అవుతారని కోర్టును కోరారు న్యాయవాదులు.