ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగింది. బాధితురాలు 8వ తరగతి చదవుతున్నట్లు తెలుస్తోంది.స్థానికంగా ఉండే ఇద్దరు యువకులు మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడగా ఆమె బంధువులు ఆ ఇద్దరిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ది చేసినట్లు సమాచారం. మరో దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
బాధిత బాలిక ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలిక బంధువల దాడిలో గాయపడిన నిందితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.