2024లో తిరుమలకు భారీ సంఖ్యలోనే భక్తులు వచ్చారు. 2024 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే ఈ ఏడాది శ్రీవారికి హుండీ ద్వారా 1365 కోట్ల రూపాయల కానుకలు సమర్పించారు భక్తులు. ఈ మేరకు టీడీపీ ప్రకటన చేసింది.
ఇక !ఇవాళ దర్శనాలు త్వరగానే అవుతున్నాయి. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఈ తరుణంలోనే… 68, 298 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. అటు 16, 544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం 4.1 కోట్లుగా నమోదు అయింది.