సోలార్ ప్లాంట్ ల ఏర్పాటుకు మహిళా సంఘాలకు చేయూత : డిప్యూటీ సీఎం భట్టి

-

సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని.. ఇందుకు ఆర్థిక చేయూతను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా భవన్ లో స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు ప్రగతీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ,  ధనసరి సీతక్కలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన అంశాన్ని అద్యయనం చేసి ఈనెల 09న నూతన ఇంధన పాలసీ ప్రకటించనున్నామని చెప్పారు.

రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు కనీసం 4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అవసరమైన పరికరాల కొనుగోలుకు బ్యాంకు రుణాల ద్వారా సంఘాలకు సమకూర్చేలా అధికారులు, బ్యాంకర్లు చొరువ తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధి మహిళా సాధికారిత, పునరుత్పత్తి ఇంధన వనరుల విస్తరణ లక్ష్యంగా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news