తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల

-

దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పన్నులలో వాటా కింద శుక్రవారం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1,73,030 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3,637 కోట్లు విడుదల చేసింది. మూలధన వ్యయం, అభివృద్ధి సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నట్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఏపీ కి అధిక నిధులు కేటాయించి.. అందులో సగం కూడా తెలంగాణకు కేటాయించకపోవడం పై సీఎం సహా మంత్రులు కూడా మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని కేంద్రం పై విమర్శలు చేస్తున్నారు. రాబోయే పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి, వారి అభివృద్ధి సంక్షేమ సంబంధిత వ్యయాలకు ఆర్థిక సహాయం కోసం విడుదల చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 

Read more RELATED
Recommended to you

Latest news