తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘనటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన చిన్న విషయం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కు బాధ్యులు అయినా వారిపై సరైన చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు.
నిన్న బాధితులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. బాధితులను పరామర్వించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకేసారి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. నిన్న సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లనే తిరుపతి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అధికారుల పై కోపం చూపించి ఆయన సాధించింది ఏముందని ప్రశ్నించారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మరిన్ని ప్రమాదాలు సంభవిస్తాయని వ్యాఖ్యానించారు అంబటి.