మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడికి పూజలు చేసి దానాలు, ధర్మాలు వంటి పుణ్య కార్యక్రమాలు చేయడం సహజమే. హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఇష్టంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చాలా మంది సంక్రాంతి పండుగ రోజున దానాలు, ధర్మాలు వంటి పుణ్య కార్యక్రమాలు చేయడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అని నమ్ముతారు. అయితే పొరపాటున కూడా ఇటువంటి దానాలను చేయకూడదు.
సంక్రాంతి రోజు కొంత మంది తెలియక కొన్ని రకాల దానాలు చేస్తారు. అయితే వాటి వలన ఎన్నో అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీన వచ్చింది. ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేయడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. దానాలు చేయడం వలన ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. అయితే వీటిని అస్సలు దానం చేయకూడదు అని గమనించాలి. సంక్రాంతి నాడు నూనెను దానం చేయడం వలన అశుభమైన ఫలితాలను పొందాల్సి వస్తుంది. ఈ రోజున నూనెను దానం చేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సంక్రాంతి నాడు నూనెను ఎవరికి ఇవ్వకూడదు.
నలుపు రంగు బట్టలను ఎవరికైనా సంక్రాంతి రోజున ఇస్తే ప్రతికూల శక్తి కలిగి సానుకూల శక్తి ప్రవహించకుండా పోతుంది. కాబట్టి సంక్రాంతి రోజున నల్లటి వస్త్రాలని ఎవరికీ ఇవ్వకూడదు అని గుర్తుంచుకోండి. అంతేకాకుండా పదునైన వస్తువులు కూడా మకర సంక్రాంతి రోజున ఎవరికి ఇవ్వకూడదు. కనుక కత్తులు, కత్తెర్లు వంటివి దానం చేయకపోవడం మేలు. ఇటువంటి పదునైన వస్తువులు దానం చేస్తే ప్రతికూల శక్తి కలిగి సానుకూల శక్తి పోతుంది. అంతేకాక గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పదునైన వస్తువులు ఇతరులకు ఇవ్వవద్దు.