కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5 గురు మృతి..సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

0
111

కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5 గురు మృతి చెందిన నేపథ్యంలో..సీఎం రేవంత్‌ స్పందించారు. కొండపోచమ్మలో యువకుల గల్లంతు ఘటనపై సీఎం ఆరా తీశారు. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… జిల్లా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.

In the wake of 5 people drowning in Kondapochamma Sagar CM Revanth responded

ఇది ఇలా ఉండగా… కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం ఏడుగురు దిగగా మునిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం అందుతోంది. మొత్తం ఏడుగురు గల్లంతు కాగా ఇద్దరు బయటపడ్డారు. ఇక అటు కొండపోచమ్మ సాగర్‌లో ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావు.