చలికాలంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో పాదాలు పగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలా శాతం మంది చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం వలన ఎక్కువగా మంచినీరును తీసుకోరు. దాంతో శరీరానికి సరిపడా నీరు అందదు. కనుక రోజులో సరిపడా నీరు ను తప్పకుండా త్రాగుతూ ఉండాలి. అలా చేయడం వలన పాదాల పగుళ్లు రాకుండా ఉంటాయి. పాదాలు పగులుతుంటే గోరువెచ్చని నీటిలో 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వలన ఎంతో మార్పుని మీరు గమనిస్తారు.
కొంతమంది పాదరక్షలను ఎంతో బిగుతుగా ఉండే విధంగా వేసుకుంటారు. ఇలా చేయడం వలన పాదాలు ఎంతో పొడిబారి పోతాయి, దాంతో పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి సౌకర్యవంతంగా ఉండేవి మాత్రమే ధరించండి. పాదాలు పగులుతుంటే స్క్రబ్ చేసుకోవడం ఎంతో అవసరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలను వేడి నీటిలో నానబెట్టడం మరియు కొంచెం సబ్బు తీసుకొని రుద్దడం వంటివి చేయాలి. ఇలా స్క్రబ్ చేయడం వలన శరీరం పై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. దాంతో పాదాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. ఎలా అయితే పాదాలను శుభ్రం చేయడం అవసరమో పాదాలకు సరైన మాయిశ్చరైజర్ రాసుకోవడం కూడా ఎంతో అవసరం.
చాలా శాతం మంది పాదాలకు మాయిశ్చరైజర్ రాస్తారు కానీ మడమలు భాగానికి మాయిశ్చరైజర్ ను ఉపయోగించారు. ఇలా చేయడం వలన పగుళ్లు ఎక్కువ అవుతాయి. కనుక పగుళ్లు ఉన్న ప్రాంతంలో ఎక్కువ జాగ్రత్త తీసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాయాలి. దీనికోసం కొబ్బరి నూనె లేక విటమిన్ ఈ ఉన్న ఉత్పత్తులను కూడా వాడవచ్చు. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. అంతేకాక ఎంతో మృదువైన పాదాలను కూడా మీరు సొంతం చేసుకోవచ్చు.