హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్…24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం

-

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగనుందని సమాచారం అందుతోంది. మంజీరా ప్రాజెక్టు ఫేజ్‌-2 పరిధిలోని 1500 MM డయా పీఎస్సీ పంపింగ్‌ మెయిన్‌కు లీకేజులు అయ్యాయని చెబుతున్నారు. ఈ లీకేజ్‌ని అరికట్టేందుకు మరమ్మత్తుల పనులు చేపడుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

Fresh water supply bandh is required in Hyderabad city

కాబట్టి.. నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని, పొదుపుగా నీరు వాడుకోవాలని సూచనలు చేశారు అధికారులు. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గం. నుంచి 14వ తేదీ ఉదయం 6 గం. వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
* ఓ అండ్ ఎం డివిజన్‌-6 : ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, బోరబండ
* ఓ అండ్ ఎం డివిజన్‌-9 : కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్‌, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌
* ఓ అండ్ ఎం డివిజన్‌-17 : పటాన్‌చెరు, రామచంద్రాపురం, దీప్తి శ్రీ నగర్‌, మదీనాగూడ, మియాపూర్‌, హఫీజ్‌పేట్‌
* ఓ అండ్ ఎం డివిజన్‌-24 : బీరంగూడ, అమీన్‌పూర్‌, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాలు

Read more RELATED
Recommended to you

Latest news