ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. మహిళపై ఆటోలో అత్యాచారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌పూర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఓ మహిళ (26)కు ఆశచూశారు ఇద్దరు వ్యక్తులు. నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చి.. ఆమెను ఆటోలో తీసుకెళ్లారు నిందితులు. ఇక ఇంటి వద్ద వదిలిపెడతామని నమ్మించి.. ఆటోలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని.. పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో వెంటనే రంగంలోకి దిగి.. పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. నిందితులు సూరజ్ కుష్వాహా, దీపక్ కుష్వాహాగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.