శబరిమల భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇక పై శబరిమల భక్తులకు ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండనుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి ఫ్యామిలీకి రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. శబరిమల యాత్రికులకు ఉచిత ప్రమాద బీమా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది టీడీబీ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాత్రికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనుంది.
యాత్రికుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని తెలిపింది టీడీబీ. కొద్ది రోజుల క్రితం అమల్లోకి వచ్చిన ఈ పథకం, పతనంతిట్ట, కొల్లాం, అలప్పుజా, ఇడుక్కి జిల్లాల పరిధిలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన యాత్రికులకు రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. ఈ కవరేజీని ఉచితంగా అందించడం గమనార్హం.
వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా లేదా స్పాట్ బుకింగ్‌ల ద్వారా తమ సందర్శనను బుక్ చేసుకునే యాత్రికులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ చొరవను అమలు చేయడానికి బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అదనపు జిల్లాలకు కవరేజీని విస్తరించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.