కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు, ఆలోచనలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ముందుగా వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
‘నాయకత్వం వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి. నిస్వార్థంగా ఉండాలంటూ సూచించారు. అనంతమైన సహనం కలిగి ఉంటే చివరకు విజయం మీదే’ అని స్వామి వివేకానంద జీ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, స్వామి వివేకానంద యొక్క కాలాతీత బోధనలను స్వీకరించి, వారి ఆశయాలను సాధించేందుకు అంకితభావంతో ముందుకు సాగాలని, అందుకు దేశంలోని యువతను నేను ప్రోత్సహిస్తున్నాను’ అని రాసుకొచ్చారు.