కెనాల్‌కు గండి.. గ్రామం జలమయమైంది. ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయాయి నిత్యావసర సరుకులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైంది గ్రామం. తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలంలోని ఎగువ ప్రాంతాలకు నీటిని కెనాల్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.
కెనాల్ మరమ్మతులు నిర్వహించకపోవడంతో గండి పడి మన్నెంపెల్లి గ్రామంలోని ఇళ్లలోకి నీరు పోయి కొట్టుకుపోయాయి నిత్యావసర సరుకులు. దీంతో గ్రామం మొత్తం జలమయమైపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గాని అధికారలు గాని నీరు విడుదల కాకముందే మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ నీరు రాకపోనని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ,అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్థులు.
కెనాల్‌కు గండి.. జలమయమైన గ్రామం
ఇండ్లలోకి నీళ్లు రావడంతో కొట్టుకుపోయిన నిత్యావసర సరుకులు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామంలోని కెనాల్‌కు గండి పడడంతో జలమయమైన గ్రామం
తోటపల్లి రిజర్వాయర్ లింకు కెనాల్ ద్వారా చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలంలోని ఎగువ… pic.twitter.com/UhHeI22Id6
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025