ఏపీలోని తిరుచానూర్ లో ఇంటింటికీ పైపు లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు తాజాగా ప్రారంభించారు. అనంతరం తిరుచానూర్ లో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టా చంద్రబాబు. పైపులన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
దాదాపు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికి పైపు లైన్ ద్వారా స్వచ్ఛమైన గ్యాస్ అందిస్తామని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ అందించేందుకు 5 కంపెనీలను సంప్రదించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. గోదావరి బేసిన్ లో 40 శాతం గ్యాస్ లభిస్తోందని తెలిపారు.