భీష్మ పితామహుడు-సంక్రాంతికి సంబంధం ఏంటో తెలుసా?

-

తెలుగు సంవత్సరం అనేది సూర్యుడు ధనుస్సురాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు.. మకర సంక్రాంతి వస్తుంది. మకర రాశికి అధిపతి శని గ్రహం.. సూర్యభగవానుడు వివిధ రాశులలో ప్రయాణించి మకర సంక్రాంతి రోజున తన తనయుడు ఇంటికి చేరుకుంటాడు.అలా సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు ఆగిన అన్నీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభం అవుతాయి..ఈ సంక్రాంతి రోజు రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు కదులుతుంది.. ఈ కదలికను ఆయనం అంటారు. అందుకే ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందని చెబుతారు. సూర్యుడు మకర రాశి నుంచి మిధునరాశి వరకు ఆరు నెలల పాటు ఉత్తర దిశలో ప్రయాణం చేస్తాడు..ఆ తర్వాత ఆరు నెలలు ఆయన కర్కాటక రాశి నుండి ధనుస్సు రాశికి దక్షిణ దిశలో కదులుతాడు. దీనిని సూర్యుని దక్షిణాయనం అంటారు. సూర్యుడు ఉదయించగానే అన్ని శుభ కార్యాలు మొదలవుతాయి..

పురాణాలు ఏం చెబుతున్నాయంటే..భీష్ముడు గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.. ఈయనది మహాభారతంలో భీష్ముడిది చాలా గొప్ప పాత్ర. కురుక్షేత్ర యుద్ధంలో పితామహుడు భీష్ముడు కౌరవుల తరపున పోరాడాడు. ఈ యుద్ధంలో అర్జునుడి రథానికి రథసారథి అయిన శ్రీ కృష్ణుడికి కూడా భీష్ముడు అజేయమైన యోధుడని.. అర్జునుడు తన పోరాట పటిమతో ఓడించలేడని తెలుసు. అయితే భీష్ముడు తాను ఏ స్త్రీపై దాడి చేయనని ప్రతిజ్ఞ చేసాడు. దీంతో శిఖండి సహాయంతో భీష్మ పితామహుడిపై బాణాలు కురిపించాడు అర్జునుడు. స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్న భీష్ముడు.. కురుక్షేత్ర యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూశారు..

ఆ సమయంలో సూర్య భగవానుడు దక్షిణాయనంలోకి వస్తాడు.. భీష్ముడు మరణం ఎన్నో మలుపులు తిరిగి ఉత్తరాయణంలో తనువు చాలిస్తాడు..అయితే భీష్ముడు దాదాపు 58 రోజుల పాటు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం ఎదురు చూశాడు. మకర సంక్రాంతితో పాటు, సూర్యదేవుడు ఉత్తరాయణుడు అయ్యాడు. అనంతరం పితామహుడు తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఉత్తరాయణంలో జీవి తన శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది.అలా భీష్ముడు మోక్షాన్ని పొందాడు..ఇది భీష్ముడు,సంక్రాంతికి గల సంబంధం..

Read more RELATED
Recommended to you

Latest news