బీ12 లోపం లేకుండా చూసుకోండి.. లేదంటే ఈ సమస్యలు వస్తాయి..!

-

పూర్తి ఆరోగ్యం కోసం శరీరానికి అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఎంతో అవసరం. చాలా మంది సరైన పోషక విలువలు ఉండేటువంటి ఆహారం తీసుకోకపోవడం వలన విటమిన్ల లోపం కలుగుతుంది. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు. విటమిన్ బి12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్. ముఖ్యంగా నాడి వ్యవస్థకు సంబంధించిన పనితీరు సరైన విధంగా జరగాలి అంటే విటమిన్ బి12 తప్పనిసరి అని చెప్పవచ్చు.

అంతేకాకుండా డిఎన్ఏ సంశ్లేషణ మరియు ఎర్ర రక్త కోణాల ఉత్పత్తికి విటమిన్ బి12 ఎంతో అవసరం. శరీరంలో ఎప్పుడైతే విటమిన్ బి12 తగ్గుతుందో అప్పుడు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా విటమిన్ బి12 జంతు ఉత్పత్తులలో లభిస్తుంది. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు మరియు చేపల నుండి విటమిన్ బి12 ను పొందవచ్చు. ఊపిరితిత్తుల నుండి ఎర్ర రక్త కణాలు శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ను తీసుకువెళ్తాయి. ఎప్పుడైతే విటమిన్ బి12 లోపం ఉంటుందో అప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో రక్తహీనత సమస్య ఎదురవుతుంది.

విటమిన్ బి12 లోపం వలన నరాలు దెబ్బతింటాయి మరియు నరాలకు సంబందించిన ఇతర సమస్యలకు కారణం అవుతుంది. కణాల పెరుగుదలకు డిఎన్ఏ చాలా అవసరం, విటమిన్ బి12 డిఎన్ఏ సంశ్లేషణలో ఎంతో అవసరం. అంతేకాకుండా విటమిన్ బి12 మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. కనుక జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతుంటే విటమిన్ బి12 ను తప్పకుండా తీసుకోండి. విటమిన్ బి12 లోపం గురించి రక్త పరీక్షలు నిర్వహించి తెలుసుకోవచ్చు మరియు వచ్చిన ఫలితాల ప్రకారం డాక్టర్ సూచించిన చికిత్స తీసుకోవాలి. విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం లేక విటమిన్ బి12 కు సంబంధించిన సప్లిమెంట్లను తీసుకోవడం వంటివి చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news