రికార్డులు సృష్టించాలన్నా.. చరిత్ర తిరగరాయాలన్నా టిడిపి కార్యకర్తలకే సాధ్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పసుపు జెండా పవర్.. పసుపు సైన్యం సత్తా.. కలిస్తే కోటి సభ్యత్వాలు అంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
“ప్రాణ సమానమైన కార్యకర్తలకు అభినందనలతో.. విశ్వవిఖ్యాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారింది. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఒక పండుగలా నిర్వహించారు. ఊరు వాడ జై టిడిపి నినాదాలతో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ తో సహా అనేక ప్రాంతాలలో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ లు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. గత రికార్డులను తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించాం” అని ట్వీట్ చేశారు నారా లోకేష్.
పసుపు జెండా పవర్.. పసుపు సైన్యం సత్తా.. కలిస్తే కోటి సభ్యత్వాలు. రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. సభ్యత్వ నమోదును సూపర్ హిట్ చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సిబ్బందికి ధన్యవాదాలు.#1CroreTDPFamily pic.twitter.com/ePRFAyVr21
— Lokesh Nara (@naralokesh) January 16, 2025