బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. బాలయ్య ఫ్యాన్స్ పై కేసు నమోదు అయింది. ఈ నెల 12వ తేదీన థియేటర్ వద్ద డాకు మహారాజ్ ఫ్యాన్స్ జంతుబలి చేసిన సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ ఫ్యాన్స్ జంతుబలి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరునంలోనే… ఐదుగురిపై కేసు నమోదు చేశారు తిరుపతి పోలీసులు. ఇక నిందితులు శంకరయ్య, రమేష్, సురేష్ రెడ్డి, ప్రసాద్, లోకేష్ బాబుగా గుర్తించారు పోలీసులు.
కాగా….డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ఈ నెల 12వ తేదీన ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. ఆ మూగ జీవాన్ని బలి ఇచ్చి దాని రక్తాని అద్ది డాకు మహారాజ్ పోస్టర్ కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమా హిట్ కావాలని మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలయ్య ఫ్యాన్స్ పై కేసు నమోదు అయింది.
బాలయ్య ఫ్యాన్స్ పై కేసు నమోదు..
ఈ నెల 12వ తేదీ థియేటర్ వద్ద డాకు మహారాజ్ ఫ్యాన్స్ జంతుబలి
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐదుగురిపై కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు
నిందితులు శంకరయ్య, రమేష్, సురేష్ రెడ్డి, ప్రసాద్, లోకేష్ బాబుగా గుర్తింపు https://t.co/CRvgPFLkbL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2025