ఢిల్లీలో కేజ్రీవాల్ పాలన ఫెయిల్ అయ్యింది.. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం ఖాయం అని బీజేపీ ఎంపీ DK అరుణ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రివాల్ జైలుకు వెళ్లారు. తెలంగాణ లో పథకాలు అమలు అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలను మహారాష్ట్ర , హర్యానా ప్రజలు నమ్మలేదు. ఢిల్లీ ప్రజలు కూడా విశ్వసించడం లేదు.
ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో లేరు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాము. బీజేపీ – బీఅర్ఎస్ ఒక్కటని ఎంతకాలం పాట పడతారు. ఈ పాట పాడే తెలంగాణలో కూర్చీ ఎక్కారు. కేసిఆర్ పై వ్యతిరేకతతో తప్పిదారి కూర్చీ లో కూర్చున్నారు తప్ప కాంగ్రెస్ పై ప్రేమతో ప్రజలు ఓట్లు వేయలేదు. Ed విచారణలో కేటీఆర్ ను అడిగింది ఏంటో అయన బయటకి వచ్చి చెబుతుంది ఏంటో.. అక్కడ అడిగింది కేటీఆర్ బయట చెప్పేది ఒక్కటేనా అనేది ఆయనకు EDకి మాత్రమే తెలుసు అని DK అరుణ పేర్కొన్నారు.