విశాఖ స్టీల్ పూర్తి సామర్ధ్యం తో పనిచేస్తుంది : రామ్మోహన్ నాయుడు

-

“విశాఖ స్టీల్” సమస్య పరిష్కారం అయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుకు ప్రధాని మోడి కి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలిపారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ స్టీల్ పునరుద్దరణకు గత ఏడు నెలలుగా ప్రధానిని ఏపి సిఎమ్ చంద్రబాబు కోరతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. కొత్త పెట్టుబడులతో విశాఖ స్టీల్ పూర్తి సామర్ధ్యం తో పనిచేస్తుంది.

“డబుల్ ఇంజన్” సర్కార్ వల్ల కలిగే ప్రయేజనాలేమిటో “విశాఖ స్టీల్” కు లభించిన ఆర్ధిక తోడ్పాటే నిదర్శనం. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం తో “విశాఖ స్టీల్” పనిచేస్తుంది. వాజపేయి ప్రభుత్వ హయాంలో కూడా “విశాఖ స్టీల్” తోడ్పాటు లభించింది. పలు మార్లు పార్లమెంట్ లో “విశాఖ స్టీల్” సమస్యల గురించి ప్రస్తావించాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖ పట్నం లో తొలిసారి ప్రధాని మోడి పర్యటించారు. ఉత్తరాంధ్రలో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పరిష్కారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. “విశాఖ స్టీల్” పూర్తి సామర్ధ్యంతో పనిచేయడమే కాకుండా, లాభాలను కూడా అర్జించే లక్ష్యంగా కృషి చేస్తాం అని పౌర రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news