ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు…!

-

ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. సినిమా రంగంలోనైనా, రాజకీయాల్లో నైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచే వారని వివరించారు బాలయ్య.

Balakrishna paid tribute to his father at NTR Ghat

తెలుగు వాళ్లంతా నందమూరి తారక రామారావు కుటుంబమే అన్నారు. ఇప్పటికీ అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయని తెలిపారు నందమూరి బాల కృష్ణ. అందరి గుండెల్లో నిలిచే నిత్యామృతంగా మారాడు ఎన్టీఆర్.. రాజకీయంగా ఆయన తెచ్చిన ఎన్నో పథకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయన్నారు. తాలుకాల నుండి మండలాలు ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆర్.. 2 రూపాయలు బియ్యం అందించిన ఘనత కూడా ఎన్టీఆర్ దే అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news