రెండేళ్లుగా ప్రేమాయణం..ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి.. సరిగ్గా నాలుగు రోజులకే..

-

ప్రేమించిన వాడు మోసం చేసి పారిపోయాడు. ముందుగా వీరిపెళ్లికి పెద్దలు నో చెప్పడంతో ఫ్రెండ్స్ సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారో ఇద్దరు ప్రేమికులు. నాలుగు రోజులు గడిచే సరికి భర్త కనిపించకుండాపోవడంతో చివరకు ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

విరుద్ నగర్ సమీపంలోని మీసలూర్ గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్, దివ్య రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో ఈ నెల 10వ తేదీన స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సరిగ్గా నాలుగు రోజులకే నవ వధువుకు వరుడు బిగ్ షాక్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ వద్దకు వెళ్లొస్తానని ఇంటికి తిరిగిరాలేదు.చివరకు బాధితురాలు స్థానిక మహిళా పీఎస్‌ను ఆశ్రయించింది. తన భర్త ఆచూకీని కనిపెట్టాలని పోలీసులను వేడుకుంటోంది బాధితురాలు. కాగా, తన భర్త ప్రణీత్ కుటుంబంతో సహా పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news