తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కారు రేస్ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు శనివారం ‘గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ జెన్’ కంపెనీ ప్రతినిధులను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్,హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డిలను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.
తాజాగా ఏసీబీ గ్రీన్ కో, ఏస్ నెక్స్ట్ కంపెనీ ఎండీ.అనిల్ కుమార్ సహా ఆ కంపెనీ ప్రతినిధులను విచారించనుంది. ఫార్ములా ఈ కార్ రేసు తొలి దఫా 9వ సీజన్‌కు ఏస్ నెక్ట్స్ కంపెనీ నిర్వహణ పార్ట్నర్గా కొనసాగింది. రెండో దఫా 10వ సీజన్ రేసు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.ఈ కంపెనీ తప్పుకోవడంతో హెచ్ఎండీఏను పార్ట్నర్గా చేర్చారు. అనంతరం ఎఫ్ఈఓ సంస్థకు రూ.55 కోట్ల నిధులను విదేశాలకు బదలాయించారు. 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నా గ్రీన్ కో సంస్థ నష్టాల కారణంగా మధ్యలోనే తప్పుకోవడంతో దాని స్థానంలో హెచ్ఎండీఏ చేరింది.