విజయవాడలో అమిత్ షా పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే… నేడు బీజేపీ నేతలతో సమావేశం అవుతారు అమిత్ షా. ఏపీ బీజేపీ కొత్త సారథిపై చర్చించే అవకాశం ఉంది. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న అమిత్ షా.. అనంతరం ఢిల్లీకి వెళతారు.
ఇక నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన విందుకు అమిత్ షా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసంలో ఆంధ్ర వంటలతో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురందేశ్వరి..ఈ విందుకు హాజరయ్యారు. అంతకుముందు.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు స్వాగతం పలికారు మంత్రి లోకేష్.