ఏపీలోని మరో దేవాలయంలో అపచారం… మద్యం బాటిల్స్, బిర్యానీ ప్యాకెట్లు దర్శనం !

-

ఏపీలోని మరో దేవాలయంలో అపచారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది నిర్వాహకంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చింది. అపచార ఘటన దృశ్యాలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

An act of mischief took place in the premises of the famous Lakshmi Narasimha Swamy temple in Korukonda, East Godavari district

దీంతో అన్నవరం దేవస్థానం అధికారులు..అలెర్ట్ అయ్యారు. ఎండోమెంట్ ఉన్నత అధికారులు..దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇలాంటి ఘటనలు జరగడంపై అపచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. దేవస్థానం కార్యాలయంలో మందు బాటిల్స్ వ్యవహారంపై స్పందించారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ. దేవాలయ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు, ఎండోమెంట్ ఆదికారులతో దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు.

ఆలయాలను అపవిత్రం చేయాలనీ చూస్తే ఉపేక్షించేదిలేదని… కూటమి ప్రభుత్వం అటువంటి వీటికి విరుద్ధమన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో సీసీ పుటేజ్, పలు కొనాల్లో విచారణ చేపట్టి నివేదికను ఉన్నతధికారులకు అందచేస్తామని… జిల్లా దేవాదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news