ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించిన సరే జీవితంలో ఆర్థికంగా స్టేబుల్ గా ఉండడం ఎంతో కష్టం అవుతూ ఉంటుంది. అయితే జీవితాంతం మీరు ఆర్థికంగా ఎంతో స్టేబుల్ గా చేతినిండా డబ్బుతో ఉండాలి అంటే తప్పకుండా ఇవి పాటించండి. ఆర్థికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటారో అప్పుడే జీవితం స్థిరంగా ఉంటుంది మరియు సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆర్థిక నియమాలను పాటించడం ఎంతో అవసరం. ఈ ఆర్థిక నియమాలను పాటించడం వలన వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మరియు ఏ విధమైన అశాంతి కూడా ఉండదు. ఈ నియమాలు ధన్వంతులుగా జీవించేందుకు ఒక మార్గాన్ని రూపొందిస్తాయి.
ఆర్థికంగా బలంగా ఉండాలంటే తప్పకుండా మీ ఆదాయం మరియు ఖర్చుల నియంత్రణలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు చేయాలి అనే దాని గురించి ఎంతో అవగాహన ఉండాలి. ముఖ్యంగా అత్యవసర అవసరాలకు కాకుండా ఇతర ఖర్చులపై ఎంతో నియంత్రణ ఉండాలి. ఖచ్చితంగా నియంత్రణ ఉంటేనే ఆర్థికంగా ఎంతో స్టేబుల్ గా ఉంటారు. అదనపు ఆదాయం కోసం ఆలోచించి, సరైన విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి. ప్రతి నెల వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేయడం ఎంతో అవసరం. కనీసం 20 నుండి 30% వరకు పొదుపుగా ఉంచండి.
ఇలా చేసినప్పుడు వాటిని డిపాజిట్లు లేక మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వలన వడ్డీని కూడా పొందవచ్చు. ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు జీవితంలో ఎన్నో అనివార్య పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వైద్య ఖర్చులు, ఉద్యోగం కోల్పోయినప్పుడు లేక ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అయినా ఎమర్జెన్సీ ఫండ్ ఎంతో అవసరం. ఈ ఫండ్ అనేది కనీసం 6 నుండి 12 నెలల ఆదాయంతో ఉండాలి. ఇలా చేయడం వలన ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండవచ్చు.