పద్మ పురస్కారాల పై సీనియర్ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం, హీరో నందమూరి తారక రామారావు కు భారతరత్న, సీనియర్ నటి, నిర్మాత విజయ నిర్మల కు పద్మ పరస్కారం రావాలని ఆయన కోరారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయనిర్మల అని గుర్తు చేశారు. తన అమ్మకు అవార్డు రావాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేశానని తెలిపారు.
కేసీఆర్ ఉన్న సమయంలో పురస్కారం కోసం సిఫారసు చేశారని చెప్పారు. అయినా తన అమ్మ విజయ
ముఖ్యమంత్రిగా నిర్మలకు అవార్డు రాకపోవడం బాధాకరమన్నారు. టాలీవుడ్(Tollywood)లో ఎంతో మంది పద్మ అవార్డులకు అర్హత కలిగి ఉన్నారన్నారు. తెలుగువాళ్లకు అవార్డులు రావాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినా తప్పులేదని నరేశ్ పేర్కొన్నారు.