రూ.450 కోట్లతో హైదరాబాద్ లో క్యాపిటర్ ల్యాండ్ పెట్టుబడి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్ లో రూ.450 కోట్ల పెట్టుబడికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. నగరంలో లక్ష చదరపు అడుగుల మేరకు భారీ ఐటీ పార్కు నిర్మించనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. 

తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చిన విషయం విధితమే. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news