2028 నాటికి‌ పోలవరం ద్వారా నీరు అందిస్తాం : అమిత్ షా

-

2028 నాటికి‌ పోలవరం ద్వారా నీరు అందుతుందని వాగ్దానం చేస్తున్నామని ప్రకటించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. NDRF, NIDM కార్యాలయాలను ప్రారంభించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. గన్నవరం, కొండపావులూరు చేరుకుని కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు.

amit shah on polavaram

ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించామని… విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ కోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్ ముందుకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వెనుక కొండలాగా అండగా ఉన్నారన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సైనికులకు అభినందనలు చెప్పారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఎన్డీఆర్ఎఫ్ వారిని చూడగానే ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నామని చెబుతుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news