పవన్ కళ్యాణ్‌కు ఝలక్ ఇచ్చారు నారా లోకేష్. ఏపీలో డిప్యూటీ సీఎం పదవి కోసం టీడీపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో… తిరుమల ఇష్యూపైన పవన్ కళ్యాణ్‌కు ఝలక్ ఇచ్చారు నారా లోకేష్. తిరుమల తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోయిన దానికి టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అంటే… టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అనే విషయంపై బీఆర్ నాయుడుకు అండగా నారా లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌కు ఝలక్ ఇస్తూ…టీడీపీ పార్టీ అభిప్రాయం టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పడం కాదన్నారు. దీంతో జనసేన పార్టీ నేతలు.. నారా లోకేష్ పై ఫైర్ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్‌కు ఝలక్ ఇచ్చిన నారా లోకేష్
తిరుమల తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోయిన దానికి టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం – ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేష్ https://t.co/h7dlurOItM pic.twitter.com/OyAxdfu3M3
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2025