కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ రైతు ధర్నాకు అడ్డుతగులుతున్నారు పోలీసులు. నల్గొండలో రేపటి కేటీఆర్ రైతు మహాధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. జిల్లాలో గ్రామసభలు జరుగుతుండటం.. హైవేపై సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ధర్నాకు అనుమతించడం లేదు పోలీసులు. రైతు ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటంతో అనుమతి నిరాకరించారు.
అయితే… ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. హైకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్ధం అవుతున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగానే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు.