రోడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. సింగిల్ లైన్, డబుల్ లైన్, హైవే రకరకాల రోడ్లు ఉంటాయి. స్పీడ్ థ్రిల్ గా ఉంటుంది. కానీ అది ప్రాణాల్ని తీస్తుంది…యువత దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న చిన్న రూల్స్ పాటిస్తే.. అద్భుత విజయాలు సాధించవచ్చు. క్లాస్ రూమ్ లో అనేక విషయాలు తెలుస్తాయి.. డాక్టర్, ఇంజనీర్ కావచ్చు. పాఠశాల దశలోనే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ముఖ్యం.
అయితే తెలంగాణ అవైర్ నెస్ పార్క్ లు ఏర్పాటు చేయడం బాగుంది. ఆటలతో అనేక అంశాలపై అవగాహన కలుగుతుంది. పుట్ బాల్ తో సమాజంలో ఎలా బతకాలో ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకోవాలో తెలుస్తుంది. పొలిటీషియన్ ఒక బోరింగ్.. మిలో ఉన్న క్రియేటివిటీ బయటకు తీయండి..అద్భుతమైన శాస్త్రవేత్తలు అవుతారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.. విద్యార్థి దశ నేర్చుకునే దశ. ఈ దశలోనే సాంకేతిక, సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన చేసుకోండి అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.