మహబూబ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జూరాల ప్రాజెక్టు నీళ్లు లీక్ అవుతున్నాయని సమాచారం. దీంతో జూరాల ప్రాజెక్టు భద్రత పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూరాల ప్రాజెక్టులోని 12 క్రస్ట్ గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయట.
జూరాల ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్ల రోప్ డ్యామేజ్. అయితే… జూరాల ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు లేక, తుప్పు పట్టి,రబ్బర్ లు ఊడిపోయినట్లు చెబుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు లీకేజీకి గురైందట. ఈ తరుణంలోనే… రిజర్వాయర్ నీరు వృధాగా పోతుందని అంటున్నారు. జూరాల ప్రాజెక్టు నీళ్లు లీక్ అవుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారట అధికారులు. మరి దీనిపై తెలంగాణ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.