దావోస్‌లో రెండో రోజూ సీఎం రేవంత్ బృందం పర్యటన

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం రెండో రోజూ దావోస్‌లో పర్యటిస్తోంది. మంగళవారం దావో‌స్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొని, కేంద్ర మంత్రులతో కలిసి గ్రాండ్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకెళ్తున్నదని చెప్పారు.

బయోటెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు.రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.భారత ప్రభుత్వం లక్ష్యమైన 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news