ఆర్జీకర్ నిందితుడికి జీవితఖైదు.. కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో సీల్దా కోర్టు ఇటీవల నిందితుడికి జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. సీల్దా కోర్టు తీర్పు అటు బెంగాల్ ప్రభుత్వానికి, బాధిత కుటుంబానికి ఏ మాత్రం నచ్చలేదు. నిందితుడికి ఉరిశిక్ష సరైనదని ఇరువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆర్జీకర్‌ ఘటనపై కొల్‌కతా హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈ కేసుపై మరోసారి విచారణ జరుపుతామని పేర్కొంది. దానికి ముందు అందరి తరఫున వాదనలు వింటామని, ఆ తర్వాతే ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. దోషిగా తేలిన సంజయ్‌ రాయ్‌, సీబీఐ, బాధిత ఫ్యామిలీ వాదనలు విన్నాకే ఆ పిటిషన్‌ను స్వీకరిస్తామని తెలిపింది. కాగా, బెంగాల్‌ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. కేసును విచారించిన సంస్థగా శిక్ష విషయంలో కోర్టుని ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉందని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news