తెలంగాణ రాష్ట్రంలో మూడో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు 9,844 గ్రామాలలో విజయవంతంగా గ్రామ సభల నిర్వహణ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. బుధవారం జరిగిన గ్రామసభలు- 3888 కాగా.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 10 లక్షల 9 వేల 131 దరఖాస్తులు వచ్చాయి.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం వచ్చిన దరఖాస్తులు 59,882 గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అటు గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్య క్తం చేస్తోంది. గ్రామ సభల్లో సమస్యలను తెలుసుకున్న ఉత్తమ్… ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తు న్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైనవారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్.