భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్‌లో ఉడకపెట్టిన భర్త.. కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భార్య మాధవిని చంపి ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించారు భర్త గురుమూర్తి. మటన్ కొట్టే కత్తితో ముక్కలుగా నరికారు భర్త. ఆపై ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి కుక్కర్‌లో ఉడికించారు గురుమూర్తి.
ఎముకలను కాల్చి, ఆపై దంచి పొడి చేసి ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ కవర్లలో పెట్టి జిల్లెలగూడ చెరువులో పడేసాడు దుర్మార్గుడు. భార్యను చంపడానికి ముందు అతను ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను చంపినట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.