కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉసురు తగులుద్ది : వికలాంగురాలి ఆవేదన

-

కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉసురు తగులుద్దని ఓ వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తనకు ఇందిరమ్మ రాలేదని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడిలో ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలో బాధితురాలు వాపోయింది.

తమ లాంటి వికలాంగులకు అధికారులు ఇళ్లు రాకుండా చేస్తున్నారని, తప్పకుండా మా ఉసురు తగులుద్దని బాధితురాలు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార పార్టీ నేతలు కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారని బాధితులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news