కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు అధికారులకు హైకోర్టులో చుక్కెదురు అయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు వేలం నిలిపి వేయాలని వేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ భూముల వేలం…వివాదాస్పదంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య KPHB భూముల వేలం…కొనసాగుతోంది. రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్లాట్లను ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్లు పరిగణలోకి తీసుకోకుండా ఫ్లాట్లను అమ్మడంతో ప్రజలు నష్టపోతారంటూ ఆందోళనకు దిగారు గులాబీ నేతలు. భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్ అయ్యారు. 28 ఫ్లాట్లను వేలం వేస్తున్నారు హౌసింగ్ బోర్డ్ అధికారులు. హైకోర్టు స్టే తో 9వ ఫేజ్ మినహాయించి.. మిగిలిన ప్లాట్ల వేలం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే… కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు అధికారులకు హైకోర్టులో చుక్కెదురు అయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు వేలం నిలిపి వేయాలని వేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.