ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మృతి చెందారు. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు షఫీ (56) కన్నుమూశారు. అంతర్గత రక్తస్రావం కారణంగా జనవరి 16న ఆసుపత్రిలో చేరారు ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు షఫీ. అతను చాలా రోజులుగా తీవ్రమైన తలనొప్పి. నిద్రలేమితో బాధపడుతున్నాడు,
ఈ తరుణంలోనే… జనవరి 16న ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా పరీక్షలు చేసిన వైద్యులు… మెదడులో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేసినప్పటికీ, షఫీ ఆరోగ్యం మరింత దిగజారింది. అనంతరం అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఇక ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు షఫీ పరిస్థితి విషమించడంతో.. తాజాగా మరణించారు.
శనివారం రాత్రి ఆయన మరణించారని సమాచారం. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన షఫీ.. తుదిశ్వాస విడిచారు. 2001లో వన్ మ్యాన్ షో సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు షఫీ. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనుమ్ మక్కలుమ్, మాయావి, చట్టంబినాడు, చాక్లెట్, మేరిక్కుండోరో కుంజాడు, మేకప్ మ్యాన్, టూ కంట్రీస్ మరియు షెర్లాక్ టామ్స్ లాంటి సినిమాలు తీసారు.